Categories
‘కాదేదీ కవితకు అనర్హం’ అని శ్రీశ్రీ గారు చెప్పినట్లు ఆర్టు కు కూడా అడ్డుగోడలు లేవు. మనస్సులోని ఆలోచనలకు ఈ ప్రపంచంలో ఏదయినా కాన్వాస్ కావొచ్చు. డబ్ ఆర్టిస్ట్ స్టీఫెన్ బ్రస్క్ కి అరటి పండంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతో బనానా ఆర్ట్ ప్రయోగాలు చేసాడు. ఆర్ట్ కి కావాల్సిన అరటి పండుని సెలెక్ట్ చేసుకుని వాటి తొక్కతోనే అద్భుతమైన చిత్రాలు సృష్టించారు. అరటి పండు తొక్కతో తాబేలు, జిరాఫీలతో పాటు కింగ్ కాంగ్, మార్లిన్ మన్రో, క్రిస్మస్ వేడుకలు అన్నీ సృస్తిన్చేసి భళి అనిపించుకున్నారు. ఈ బనానా ఆర్ట్ ఎంతో బాగుందని సోషల్ వెబ్ సైట్ లో ఈ ఆర్టిస్ట్ ని అభినందనలతో ముంచెత్తారు నెటిజన్లు. చూడండి భలేగా వుందీ బనానా ఆర్ట్.