Categories
సరోజినీ నాయుడు హైదరాబాద్ లో బెంగాలీ బ్రహ్మణ కుటుంబంలో 1879 ఫిబ్రవరి 13వ తేదీన జన్మించారు. భారత కోకిల (నైటింగేల్ ఆఫ్ ఇండియా) గా ప్రసిద్ధి చెందిన ఈమె భారత స్వాతంత్ర సమరయోధురాలు మరియు కవయిత్రి ,అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకి తొలి మహిళా అధ్యక్షురాలు అయిన సరోజినీ నాయుడు భారతదేశపు తొలి మహిళా గవర్నరు కూడా. ఆమె ఆంగ్లంలో గోల్డెన్ త్రెషోల్డ్, ది బర్ద్ ఆఫ్ టైం, ది బ్రోకెన్ వింగ్ వంటి కవితలు రాశారు.రాజకీయ,సామాజిక, రచనా రంగాల్లో ఆమెకు సాటి ఎవరు లేరు. అత్యున్నత స్థాయికి ఎదిగిన మహిళ రాజకీయ దిగ్గజం సరోజినీ దేవీ.