పగలంతా ఎడతెరిపి లేని పని, ఇటు ఇల్లు, ఉద్యోగంతో ఆడవాళ్ళకు భోజనం చేయటం కుదరక పోవచ్చు . ఒక్కొసారి రాత్రి వేళ ఆకలనిపిస్తే తినకూడదని ఊరుకొంటు ఉంటారు. రాత్రి వేళ ఆకలేస్తే హాయిగా తినవచ్చు. మన శరీరం 24 గంటల గడియారానికి అనుసంధానమై ఉంటుంది. రోజు పూర్తైయ్యేసరికి చాలా భాగం కాలరీలు ఖర్చైపోతాయి. రాత్రి వేళ ఆకలనిపిస్తే పాలు,పండ్లు ,నట్స్ ,పెరుగు వంటి డైరీ ఉత్పత్తులు తీసుకోవచ్చును. చీజ్ మంచిది కూడా దీనిలోని ప్రోటీన్ అధికంగా ఉండి శక్తి నెమ్మదిగా శరీరంలోకి విడుదల అవుతుంది. ఎమినో యాసిడ్ సఫ్లయిస్ రాత్రంతా మెయిన్ టెయిన్ అవుతాయి.

 

Leave a comment