మన రొజువారీ జీవిత విధానం లో బంధువులకు స్నేహితులకు ఆతిధ్యం ఇస్తూవుంటాం. అది హోటల్ లో కానీ ఇళ్ళు కానీ నియమాలు తప్పని సరిగా పాటించాలి. డైనింగ్ టేబుల్ సరైన చోట ఏర్పాటు చేయాలి. గ్లాసులు, చంచాలు, కత్తులు, ఫోర్క్ లు, కళాత్మకంగా అమర్చాలి లేదా అందుబాటులో దొర్లి పోకుండా జాగ్రత్తగా ఉండేలా పెట్టుకోవాలి. అందరికీ వీలయ్యె సరైన సందర్భంలో భోజనాలు ఏర్పాటు చేయాలి. మనం ఎందుకు పిలుస్తున్నామో సరిగ్గా చెప్పగలిగితే అతిధులకు ఆ సందర్భం లో తినే ఆహారం ఏముంటుందో ఉహించగలుగుతారు. అలాగే ఫలానా ప్రత్యేకమైనవి ప్రిపేర్ చేస్తున్నామని అవతలి వాళ్ళకు చెప్పి పర్లేదు అతిధికి ఇష్టమైన ఆహారం గురించి కూడా తెలుసుకుని ఏర్పాట్లు చేయొచ్చు. నిర్ణయించిన సమయం కంటే కాస్త ముందే అన్ని సిద్ధంగా వుంచుకోండి. భోజనం చేసే సమయంలో వ్యక్తిగత, వ్యాపార విషయాలు అప్పుడప్పుడే మాట్లాడాలని చూడొద్దు. అతిధి ఆహారం తింటు వుండగానే వాళ్ళకు అవసరమైనవి అందుబాటులో వుండాలి. మంచి నేప్ కిన్, శుబ్రమైన టవళ్ళు అందుబాటులో వుంచుకోవాలి. ఒక వేళ మనం కనుక అతిధులుగా వెళ్ళివుంటే , మరుసటి రోజు తప్పకుండా, భోజనాల ఏర్పాటు చేసిన వాళ్ళకు ఫోన్ చేసి థాంక్స్ చెప్పడం మరచిపోవద్దు.
Categories