సన్నగా నాజుగ్గా కనిపించేందుకు అమ్మాయిలూ చాలా కష్టపడతారు. ముందుగా తిండి మానేస్తారు. ఈ జీరో ఫిగర్ పెళ్ళికాక మునుపు ఎలా ఉన్నా, పెల్లైయ్యకా బిడ్డకు జన్మ నివ్వాలంటే మాత్రం చాలా సమస్యలు తెస్తుంది. ఇలా సన్నగా ఉండి శరీరానికి పోషకాలు అందివ్వని వాళ్ళలో గర్భ స్రావాలు, బరువు తక్కువ బిడ్డకు జన్మ నివ్వటం, తక్కువ అనిమియోటిర్ ఫ్లూయిడ్ లాంటి ఎన్నో సమస్యలు వస్తాయి. అందుకే బిడ్డను కావాలనుకొన్న వాళ్ళు సన్నగా నాజుగ్గా ఉండాలనే కోరికను పక్కన పెట్టి ప్రేగ్నన్సి ని వాయిదా వేసుకొని, ముందుగా డాక్టర్ సలహాతో బరువు పెరిగి, పూర్తి ఆరోగ్యంతో బిడ్డను కనే శారీరక స్థితిలో ఉన్నారని డాక్టర్ చెప్పిన తర్వాత బిడ్డకు జన్మనిచ్చే ఆలోచనకు శ్రీకారం చుట్టాలి.

Leave a comment