గర్భం దాల్చాక తల్లి మనోభావాలు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి విడదీయరాని సంబంధం  ఉంటుందని భారతీయ సంస్కృతి ఏ నాటి నుంచో విశ్వసిస్తోంది. అందుకే ఆమె చురుగ్గా ఉండాలని మంచి వాతావరణం మంచి పరిసరాలు ఉండాలని మంచి పుస్తకాలూ చదువుకోవాలని మంచి సంగీతం వినాలని చెప్తుంటారు. వీటన్నింటి ప్రభావం పుట్టబోయే బిడ్డపై ఉంటుందని వారి అభిప్రాయం. ఇటీవల పరిశోధనలు ప్రాచీన నమ్మకాన్ని బలపరుస్తున్నాయి. తల్లిలోని భావోద్వేగ సంబంధిత హార్మోన్లు బిడ్డకు ట్రాన్స్మిట్ కావటమే ఇందుకు కారణం గర్భంలో వున్నప్పుడు తల్లి తీవ్రమైన వత్తిడి ఎదుర్కుంటున్నట్లైతే ఆ బిడ్డలు హైపరాక్టీవ్ లేదా ఎమోషనల్ సమస్యలతో ఉంటారని సగటు ఐక్యూ కంటే తక్కువ కలిగి ఉంటారని అధ్యయనం లో పేర్కొన్నారు. కాబట్టి తల్లి ఎంత మానసిక ప్రశాంతతతో వుంటే  బిడ్డకు అంత మంచిది.

Leave a comment