ఆకలి తగ్గిపోతుందని ఫలితంగా బరువు తగ్గి పోతారని యువతరం అదేపనిగా నమితే చూయింగ్ గమ్  వల్ల లాభం ఏదీ ఉండదనీ అందుకు మింట్ గమ్  ఏ మాత్రం సహకరించదని  ఈ మధ్యకాలపు పరిశోధనలు చెపుతున్నారు. ఈ మింట్ చూయింగ్ గమ్ వల్ల  పండ్ల కూరగాయలు తినాలనే కోరిక తగ్గిపోయి చిప్స్ క్యాండీలు వైపుకు ధ్యాస వెళ్లిపోతుందిట. మింట్ గమ్స్  పండ్ల కూరగాయల రుచి తగ్గిస్తాయి. తక్కువ ఆరోగ్యం ఇచ్చే ఆహారం వైపుకు జిహ్వ కు లాగేస్తాయి. లవంగం భోజనానికి ముందు నమిలితే ఆహారం  తక్కువే తింటారేమో గానీ క్యాలరీల మోత భారీగానే వుంటుంది . మింట్ లో వుండే మెంథాల్ పండ్ల కూరగాయల్లోని   పోషకాలతో ఇంటరాక్ట్ అయ్యి కొంత చేదు రుచి సృష్టిస్తుంది. దీన్ని  చప్పరించే  వాళ్ళు ఇక పొటాటో చిప్స్ కాండీల వైపు మళ్లుతారు. కాబట్టి బరువు తగ్గించే మార్గం చూయింగ్ గేమ్ నమలటం మాత్రం కాదు.

Leave a comment