Categories
నగలు కొన్న తర్వాత కొన్నాళ్ళు ముచ్చటగా పెట్టుకొని ,కొత్త మోడల్ ని చూడగానే సాధారణంగా మార్చేస్తూ ఉంటారు. అయితే నగల మార్పిడి విషయంలో కొంత జాగ్రత్తలు పాటించమంటున్నారు. ఏ రకం నగలు కొత్తగా కొన్న బి.ఎస్.ఐ ముద్ర ఉండేలా చూసుకొంటే మార్చే సమయంలో ధర సరిగ్గా లెక్కించుకొనే వీలుంటుంది. నగలు మార్పిడికి ముందు బంగారం ధరలు ఒక వారం పాటు మార్కెట్ రేట్ గమనించుకోవాలి. రాళ్ళ నగలు కొన్నప్పుడు బంగారంతో పాటు రాళ్ళ ధర కూడా చెల్లిస్తారు,మార్పిడి సమయంలో బంగారం ధర మాత్రమే లెక్కిస్తారు నగలు కొన్న సమయంలో బిల్లు జాగ్రత్తగా పెడితే బిల్లులో ధర ఖచ్చితంగా కనబడుతుంది కనుక మార్పిడి సమయంలో నగ బరువు విషయంలో మోసపోకుండా ఉండవచ్చు.