ఎలాంటి ఇన్ఫెక్షన్ల లేదా మచ్చలు పడకుండా బ్లాక్ హెడ్స్ సులువుగా తొలగించుకోవచ్చు. ముఖానికి ఆవిరి పట్టి చర్మరంధ్రాలు పెద్దవయ్యాక బ్లాక్ హెడ్స్ తేలిగ్గా బ్లాక్ హెడ్ రిమూవర్ తో తొలగించవచ్చు. ముల్లంగి గింజల్ని నీటి తో కలిపి గ్రైండ్ చేసి అప్లయ్  చేస్తే బ్లాక్ హెడ్స్ రాలిపోతాయి. ఓట్ మీల్ లేదా బాదం మాస్క్ వేసినా  ముఖం క్లీన్ అవుతుంది. బాదం పొడిని లేదా ఓట్ మీల్ ని రోజ్ వాటర్ తో కలిపి ఈ మాస్క్ వేయాలి. వేళ్ళ కొనాలతో నెమ్మదిగా రబ్ చేస్తే ఈ బ్లాక్ హెడ్స్ రాలిపోతాయి. నిమ్మరసం రాస్తూ నెమ్మదిగా మసాజ్ చేసినా బ్లాక్ హెడ్స్ లూజ్ గా అయిపోతాయి. తర్వాత బ్లాక్ హెడ్స్ ని తేలికగా తొలగించవచ్చు.

Leave a comment