Categories
ఆయిలీ స్కిన్ కారణంగానే బ్లాక్ హెడ్స్ సమస్య వస్తుంది. వాతావరణ కాలుష్యం వల్ల మొహం పై దుమ్ము పేరుకుని ఈ బ్లాక్ హెడ్స్ వస్తాయి ముక్కు నుదురు, గడ్డం పై వచ్చే ఈ బ్లాక్ హెడ్స్ పోవాలంటే ఈ చిట్కాలు పాటిస్తే చాలు. ఓ కప్పు నీళ్ళ తో వున్న పాత్రని టేబుల్ పైన పెట్టి ముఖానికి ఆవిరి పట్టించాలి. తర్వాత ఓ టవల్ తో బ్లాక్ హెడ్స్ వున్న ప్రాంతంలో రుద్ది చన్నీ ళ్ళ తో కడిగి ఏదైనా ఫేస్ ప్యాక్ వస్తే బ్లాక్ హెడ్స్ పోతాయి. అలాగే టేబుల్ స్పూన్ పెరుగులో ఓ స్పూన్ బియ్యం పిండి కలిపి మొహానికి ఆవిరి పట్టించాక ఈ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ వున్న చోట రుద్దితే సమస్య రెండు మూడు వారాల్లోనే పోతుంది.