సిద్దిపేట జిల్లా తొగుట మండలం లింగాపూర్ గ్రామంలో మహిళా రైతు జక్కుల రేణుక అనేక రకాల బియ్యాన్ని పండిస్తోంది నలుపు, ఎరుపు పసుపు,బంగారు వర్ణాల  రైస్ వెరైటీలు ఆమె సాగుచేస్తోంది ఔషధ గుణాలు ఉన్న నల్ల, ఎర్ర  వరిసాగు ఆమె ప్రత్యేకం చింతలూరు సన్నబియ్యం, చిట్టి ముత్యాలు,నవారా,కులాకర్ వంటి రకాలతో పాటు సువాసన ఇచ్చే ఎన్నో రకాలున్నాయి. నల్లబియ్యం లో  బి-12 బి-6 విటమిన్లు విరివిగా ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు, మధుమేహం ఉన్న వాళ్ళకి ఇవి ఔషధం వంటివే సేంద్రీయ పద్ధతిల్లో ఈ సాగు చేస్తోంది రేణుక.

Leave a comment