Categories
ఇంటి ముందు నాటుకోనేందుకు పనికి వచ్చే ఇంకో కొత్త అందం సృష్టించారు ఉద్యానవన నిపుణులు. త్రీ రోజెస్ కి రూప కల్పన చేసారు. కనీసం మూడు రకాల గులాబీ మొక్కల్ని అంటగట్టి ఒకే రకమైన కాండంతో కలిపి పెంచితే ఇలాంటి చెట్టు లాంటి గులాబీ పువ్వుల బోకే సిద్దం అవ్వుతుంది. ఎక్కువ పూలు పూసేవి, సువాసన వచ్చేవి, అందమైన రంగులున్నవి ఎంచుకుని ఒక గులాబీ చెట్టుకు మిగతా రెండు అంటు కడితే, ముఖ్యంగా పై భాగాన ఎక్కువ పువ్వులు పూసే గులాబీని కలిపి పెంచితే ఈ త్రీ రోజెస్ చెట్టు అయ్యింది. ఈ పూలబోకే చెట్టుని వాకిలి కి అటు ఇటు పెంచుకుంటే చక్కగా వుంటుంది. తోట గా పెంచినా బావుంటాయి.