ఒక గ్రామంలో వందకుపైగా కళాకారుల కుటుంబాలు ఉన్నాయి.  వీరంతా 12వ శతాబ్ధం నాటి పత్తచిత్ర కళకు ప్రాణం పోస్తారు.  ఒరిస్సాలోని రఘురాజాపురం గ్రామం ఇది.  పూరీకి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది.  ఈ చిన్న గ్రామంలోని ఇళ్ల గోడల నిండా  రామాయణం, మహాభారతాల్లోని  సన్నివేశాలు అద్భుతంగా చిత్రించి ఉంటాయి.  పత్త చిత్రం అంటే వస్త్రంపైన వేసే బొమ్మలో  కాటన్ లేదా తుస్సార్‌ సిల్కు వస్త్రాల్ని పొరలుపొరలుగా అంటించి చిత్రాల్ని వేసే కాన్వాస్ లో తయారు చేస్తారు.  రంగును సహజమైన అటవీ ఉత్పత్తులతో తయారు చేస్తారు.  ఎలుక బొచ్చుతో ప్రత్యేకమైన బ్రెష్ లు తయారు చేసుకోంటారు.  ఒక్క సన్నివేశం చిత్రించాలంటే ఐదు రోజులు అవ్వోచ్చు , ఐదారు నెలలు పట్టవచ్చు.  ఎంతో అందమైన కళ్లు చెదిరే రంగుల పెయింటింగ్స్ ఇవి.  పర్యాటకులను గ్రామ వాసులు ఇళ్ళకు ఆహ్వానించి తమ పెయింటింగ్స్ ను వివరిస్తూ ఉంటారు.

Leave a comment