ఎండ వేడి మొదలైన కొద్దీ వంటికి మెత్తగా తేలికగా అనిపించే కాటన్ దుస్తులు ధరిస్తే హాయిగా ఉంటుంది. అమ్మాయిలకు ప్రింటెడ్ కాటన్ చుడిదార్ మంచి ఎంపిక. ప్రింటెడ్స్ కాటన్స్ తో కాంట్రాస్ట్ రంగులు ఎంచుకొంటే మరింత బావుంటుంది. టాప్ ఉన్నా డిజైన్ ను పోలిన రంగుతో బాటమ్ ఎంచుకోవాలి రెండింటికీ మ్యాచ్ అయ్యే కలర్ ఫుల్ చున్నీ వేసుకోవాలి. బెల్ హాండ్స్ లాంగ్ హాండ్స్ స్లీవ్ హాండ్స్ ఎలాటి డిజైన్ లో కుట్టించుకొన్న కాటన్ చుడీదార్ లో అందంగా కనిపిస్తారు. శాండీల్స్,ఫ్లాట్స్ లాంటి చెప్పులు సింపుల్ జ్యూవెలరీ,కాటన్ చుడీదార్ కు చక్కగా ఉంటాయి. మెరుపులు మెరిసే యాక్ససరీస్ కాకుండా తేలికగా ఉండేవి ఎంచుకొంటే బావుంటాయి.

ReplyForward

Leave a comment