Categories
ఎక్కువ సేపు కూర్చొని పని చేసేవాళ్ళలో జ్ఞాపకశక్తి చాలా తొందరలో తగ్గి పోతుంది అంటున్నారు అమెరికా శాస్త్రవేత్తలు. ఎక్కువ సమయం కూర్చుంటే మధుమేహం,గుండె జబ్బులు బారిన పడే అవకాశం చాలా ఎక్కువ అంటున్నారు. గంటల కొద్దీ కూర్చుంటే మెదడులోని జ్ఞాపకశక్తి కి సంబంధించిన మడియల్ టెంపోరల్ లోబ్ పొర పల్చబడుతోందని ఈ పరిశోధనలో నిర్ధారణ అయింది. దానితో జ్ఞాపకశక్తి తగ్గి డెమన్షియా కు దారి తీస్తుంది. ఒక సారి పొర దెబ్బ తింటే ఎంత వ్యాయామం చేసిన ఫలితం ఉండనట్లే అందుకే ఎక్కువ సేపు కూర్చోకండి అంటున్నారు పరిశోధకులు.