జీవితాన్ని మార్చగలిగిన శక్తి గల సాధనం పుస్తకం . పిల్లలను పుస్తకాలు చదివేలా ప్రోత్సహించటం తల్లిదండ్రుల బాధ్యత.మనోవికాసం కలిగించే పుస్తక పరిచయం పిల్లల్లో సృజనాత్మకతను వెలికి తీస్తుంది. అక్షరాలు వాళ్లకు కొత్త ప్రపంచాన్ని చూపిస్తాయి.క్లాస్ పుస్తకాలతో సహా పిల్లలకు ఇతర పుస్తకాలు చదివే ఉత్సాహం తీసుకురావాలి. కల్పనిక సాహిత్యం జానపద కథలు చారిత్రాత్మక అన్ని రకాల పుస్తకాలు పిల్లలకు చూపించాలి పరిచయం చేయాలి. ప్రతిరోజు వాళ్లకు చదివి వినిపించి మరి అలవాటు చేయాలి. ఆకర్షణీయమైన బొమ్మలు పుస్తకాలతో పఠనం మొదలు పెట్టించాలి. పిల్లలను సాధారణంగా రంగులతో నిండిన బొమ్మలు, ఆ బొమ్మల కథలు సాహసోపేతమైన ఇతివృత్తాలు ఆకర్షిస్తాయి. అందరం చిన్నప్పుడు ఒక రాజు ఏడుగురు కొడుకులు ఏడు చేపల కథ వినే ఉంటాము అలాగే కథల పట్ల, పుస్తక పఠనం పట్ల ఆసక్తి కలిగి ఉంటుంది.పిల్లలకు కూడా ఆ అద్భుతమైన సాహిత్యవనాలను పరిచయం చేయటం పెద్దవాళ్లుగా మన బాధ్యత.వాళ్లకు బహుమతిగా పుస్తకాలే ఇవ్వండి.
చేబ్రోలు శ్యామసుందర్
9849524134
Categories