పరీక్షలు సరిగా రాయలేదనో,చదివినవి జ్ఞాపకం పెట్టుకోకుండా అశ్రద్దగా ఉంటున్నారనో పిల్లల పైన కోపం  తెచ్చుకోవద్దు . అది వాళ్ళ పోషణ లోపం కూడా కావచ్చు చూసుకోండి అంటున్నారు పోషకాహార నిపుణులు . పిల్లల శరీర పోషణలో లోపాలు కూడా పిల్లల్లో నిస్సత్తువును తెస్తాయి . చాలా మంది పిల్లలు ఉదయాన్ని బ్రేక్ పాస్ట్ చేసేందుకు ఇష్టపడరు . అంతకు ముందు రాత్రి ఏడూ ఎనిమిది మధ్య వాళ్ళు భోజనం చేసి ఉంటే ఉదయానికి 12 గంటలు గడిచి ఉంటాయి . రక్తంలోని గ్లూకోజ్ నిల్వలు అప్పటికే బాగా పడిపోతాయి . మెదడు సరిగ్గా పనిచేయాలి అంటే అవసరమైన గ్లూకోజ్ అందాలి . అందువల్లే పిల్లలు ,టీచర్లు చెప్పినవి గానీ చదివినవి గానీ మెదడులో నిలుపుకో లేకపోతారు . బ్రేక్ ఫాస్ట్  అన్నది లంచ్ డిన్నర్ ల కంటే కూడా చాలా ముఖ్యం ఇది పిల్లల తెలివితేటల పైన వాళ్ళ జ్ఞాపక శక్తి పైన ప్రభావం చూపెడుతుంది అంటున్నారు .

Leave a comment