Categories
![ఆరోగ్యం ముఖ్యం అనుకొన్నప్పుడు ప్రతి చిన్న విషయం లోనూ ఎంతో జాగ్రత్త తీసుకోవాల్సిందే. మేకప్ బ్రష్ లు పదే పదే వాడుతుంటారు. అవి రోజు క్లీన్ చేసేందుకు సమయం ఉండకపోవచ్చు. కనీసం వారానికి ఒక రోజన్నా శుబ్రం చేయాలి. ఆలివ్ నూనె లో ముంచిన దూదితో బ్రష్లు తడుపుతూ వుంటే వాటి పైన పేరుకొన్న అలంకరణ సామాగ్రి తలూకు అవశేషాలు క్రిములు పోతాయి. బ్రష్ కుచ్చుళ్ళు ఎక్కువ రోజులు నాణ్యంగా ఉంటాయి. కొబ్బరి నూనె లో యంటి బాక్టీరియల్ గుణాలన్నాయి. అవి బ్రష్ల పైన పేరుకున్న క్రిములు దూరం చేస్తాయి. ఒక్క గిన్నెలో కాస్తా కొబ్బరి నూనె తీసుకున్నా అందులో బ్రష్ లు ముంచి ఉంచేసి మర్నాడుఉదయం షాంపూ కలిపి నీళ్ళతో కడిగి ఆరబెడితే బావుంటాయి. అలాగే బేబీ షాంపూ వేసిన నీళ్ళలో బ్రష్లు పడేసి ఓ అరగంట తర్వాత శుబ్రంగా కడిగేసి నీడలో ఆరనిస్తే అంటుకున్న క్రిములూ, క్రీములూ రెండూ వదులుతాయి. అలాగే నిమ్మ గుణాలున్న ఫేస్ వాష్ ని నీళ్ళలో వేసి, బ్రష్ లు అందులో ముంచి కడిగేసినా అలంకరణ కోసం అడ్డుకున్న క్రిములు, పౌడర్లు వదిలి పోయి ఫ్రెష్ గా ఉంటాయి.](https://vanithavani.com/wp-content/uploads/2017/04/mackup-brush.jpg)
మొహం పైన గుల్లలు ర్యాష్ వచ్చిన ఇది మేకప్ బ్రెష్ లు శుభ్రంగా లేక పోవటం వల్లనే అనుకోవచ్చు. వీటిలోని బాక్టీరియా చర్మం ఎలర్జీలకు కారణం అవుతుంది. మేకప్ బ్రెష్లు డన్ ఇన్ ఫెక్ట్ చేసేందుకు షాంపూ క్లీన్ స్పాంజి చాలు.లేకపోతే క్లీన్ బ్రెష్ ల కోసం ఉద్దేశించిన క్లెన్సింగ్ సోల్యూషన్ తో కూడా వీటిని శుభ్రంగా ఉంచవచ్చు. లేదంటే లిక్విడ్ శానిటైజర్లు కూడా ఉపయేగమే ప్రతి సారీ వాషింగ్ తరువాత బ్రెష్ లను ఇరవై నిమిషాల పాటు ఎండలో ఉంటే బాక్టీరియా లేకుండా ఉంటాయి. వీటిని ఎప్పుడు పరిశుభ్రంగానే ఉంచాలి. వాడిన ప్రతి సారి శుభ్రం చేస్తూ ఉంటే సమస్య రాకుండా ఉంటుంది.