చాల మంది సినిమా వాళ్ళు చోట్ట బుగ్గల కారణంగా చాలా అందంగా కనిపిస్తూ ఉంటారు. బయట కొందరికి ఈ చోట్ట బుగ్గలు ఉంటే బావున్నారని అనుకొంటాం కూడా. ఇలాంటి అందమైన చోట్ట బుగ్గలు కాస్మోటిక్ సర్జన్స్ ఆపరేషన్ తో తెప్పిస్తాం అంటున్నారు. చెంప భాగానికి మత్తు ఇచ్చి కండరంలోని చిన్న భాగాన్ని గుండ్రంగా కోయటం లేదా కరిగించటం ద్వారా చోట్ట తెప్పిస్తామంటున్నారు. అరగంట లోపునే అయిపోతుందట ఈ సర్జరీ. శస్త్ర చికిత్స లేదా లేజర్ చికిత్స ద్వారా నవ్వినప్పుడు లేదా నవ్వకపోయినా చోట్ట బుగ్గలు కనిపిస్తాయన్న మాట. మోడలింగ్ సినిమా రంగాల్లోకి వెళ్ళాలనుకోనే వాళ్ళు చాలా మంది ఈ చికిత్స కోసం అడుగుతున్నారట. ఈ డింపుల్ ప్లాస్టీ ఇవ్వాళ అమ్మాయిలను ఆకర్షిస్తోంది.

Leave a comment