Categories
నైపుణ్యాలు ఉండి చక్కని వ్యాపారం చేద్దామనుకొనే మహిళలకు పనికివచ్చే పథకాలు ఎన్నో ఉన్నాయి . ఆహార రంగాన్ని ఎంచుకొంటే , భారతీయ మహిళా బ్యాంక్ అన్నపూర్ణ పథకం క్రింద రుణం ఇస్తుంది . 50 వేల వరకు రుణం తీసుకోవచ్చు 11.75 శాతం వడ్డీరేటు ఉంటుంది . వంటసామాగ్రి ,పరికరాలు ,వాటర్ ఫిల్టర్లు ,కేటరింగ్ కు సంబందించిన ఇతర వస్తువులు సమకూర్చు కొనేందుకు ఈ పథకం ఉపయోగ పడుతుంది . 18 నుండి 60 ఏళ్ళవయస్సులో ఉన్నవాళ్ళు ఈ రుణం పొందేందుకు అర్హులు . అప్పు తీసుకున్న రుణ గ్రహీతలు తమ ఆస్తుల వివరాలు బ్యాంక్ కు సమర్పించాలి . ఇలాంటివే స్త్రీ శక్తి , దేనా శక్తి ,సెంట్ కళ్యాణ్పథకం ,ముద్ర ,ఉద్యోగిని పథకాలున్నాయి .