Categories
స్క్రబ్ లు ఇంట్లో చేసుకొని సరిగా ఉపయోగిస్తే ముఖ చర్మం ఆరోగ్యంగా ఉంటుందని ఎక్స్ పర్ట్స్ చెపుతున్నారు. ఉదహారణకు ఆరెంజ్ పీల్ పొడి బట్స్ ఒక్క స్పూన్ తీసుకొని అందులో స్పూన్ తేనె కలిపి అవసరం అయితే కాసిన నీళ్ళు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖం మెడపై సర్య్కులర్ కదలికతో అప్లైయ్ చేసి కడిగేస్తే ముఖం తేజస్సుతో ఉంటుంది దీన్ని అప్లైయ్ చేసే ముందర ముఖంపై చల్లని నీరు చిమ్ముకోవాలి. ఒక స్పూన్ స్క్రబ్ ముఖం మెడపై రాసి మెల్లగా మసాజ్ చేయాలి.కళ్ళకింద భాగాన్ని వదిలేయాలి. ఎక్కువ ప్రెజర్ పెట్టకూడదు. రెండు నిముషాల మించి స్క్రబ్ చేయకూడదు. నిమ్మకాయకోసి ఆ ముక్కను చేతిలోకి తీసుకొని పంచదార పొడి అద్ది మృదువుగా మసాజ్ చేసినా మంచి ఫలితం ఉంటుంది.