మొక్కల పైన ఎంతో ఇష్టం ఉంటుంది కానీ ఇంట్లో చోటు ఉండదు అలాంటప్పుడు వర్టికల్ గార్డెన్ ఎంచుకోండి. గోడకు చెక్కను అమర్చి వాటికి నిలువుగా అమర్చిన ప్లాస్టిక్ కంటెయినర్స్ బాస్కెట్స్ వేలాడదీసి పుదీనా, కొత్తిమీర వంటి వంటింటికి ఉపయోగపడే ఆకుకూరలు పెంచచ్చు. బాల్కనీ రెయిలింగ్ కు హ్యాంగింగ్ బాక్స్ లు ఏర్పాటు చేసుకుని కూడా మొక్కలు పెంచచ్చు చూసేందుకు కూడా ఆకర్షణీయంగా ఉంటాయి. ఇండోర్ మొక్కలకు నీటి అవసరం కూడా తక్కువే ఉంటుంది. ఎప్పటికప్పుడు పాదాల దగ్గర శుభ్రం చేయటం ఎండిన ఆకులు తొలగిస్తే బాల్కనీలో కూర్చునేందుకు ఇబ్బంది లేకుండా ఉంటుంది.

Leave a comment