Categories
కొన్ని రకాల మాంసాలలో అదీ రెడ్ మీట్ లో కాన్సర్ అవకాశాలు పెరుగుతున్నాయని పరిశోధనలు చెప్పుతున్నాయి. జంతువులతో పాటు కొన్ని రకాల చేపలలో, పాల ఉత్పత్తులల్లో సిఎం ఎహెచ్ అనే జెంయువు వుంటుంది. ఇది న్యు 5 జిసి అనే చక్కర కణాలను ఉత్పత్తి చేస్తుంది. రెడ్ మీట్ తిన్నప్పుడు వాటిలోని న్యు 5 జీసి చక్కరలు రక్తంలోకి చేరుతాయి. శరీరంలోని రోగ నిరోధక వ్యవస్ధ వీటిని పరాయి కణాలుగా గుర్తించి వాటిని వదిలించుకునే రీతిలో స్పందించినప్పుడు కాళ్ళవాపు, మంటలు, కీళ్ళ నొప్పులు చివరకు కాన్సర్ కు కుడా కారణం అవ్వుతుందని గుర్తించారు. నెవాడా విశ్వ విద్యాలయ శాస్త్రవేత్తలు. 322 జంతు జన్యు కణాలను గుర్తించి ఈ నివేదిక ఇచ్చారు.