కొన్ని రకాల పండ్లు కూరగాయలు తింటే కేన్సర్ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని చెపుతున్నారు అధ్యయనకారులు . యాపిల్ ,ఆరెంజ్,బ్లు చెర్రీస్ ,బ్రొకోలి వంటి వాటిల్లో ఫ్లేవనాయిడ్స్ అధికంగా లభిస్తాయని అవి శరీరంలోని వాపును అడ్డుకొని కేన్సర్ వచ్చి ప్రమాదాన్నించి శరీరాన్ని కాపాడుతాయని చెపుతున్నారు . ప్రతి రోజు 500 మిల్లీ గ్రాముల ఫ్లేవనాయిడ్స్ ఆహారం ద్వారా తీసుకొంటే కేన్సర్ ,గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 30శాతం వరకు తగ్గుతుందని తాజా అధ్యయనాలు చెపుతున్నాయి . ప్రతి రోజు ఒక యాపిల్ ,ఒక ఆరెంజ్ తినండి చాలు ఆరోగ్యం మీ చేతుల్లో ఉన్నట్లే అంటున్నారు అధ్యయనకారులు.

Leave a comment