Categories
ఈ ప్రపంచంలో ఏ మూల ఉన్న మనుషుల్ని కలిపే అత్యున్నతమైన కమ్యూనికేషన్ మాట,భావాన్ని వ్యక్తం చేయాలంటే మంచి భాష మంచి మాట తీరు ఉండి తీరాలి. మానవ సంబంధాల మెరుగుదలతో కెరీర్ నిర్మాణంలో మాట కీలకం. అంతే కాదు,భాషా నైపుణ్యాలు మెదడు పరిణితికి మానసిక వికాసానికి తోర్పడుతాయంటారు. భాషా పరిజ్ఞానం ఎక్కువగ ఉన్న విద్యార్థుల్లో మెదడు పనితీరు బావుందని నిపుణులు తన విస్తృత పరిశోధనల్లో గుర్తించారు చిన్న తనంలో ఎక్కువ భాషలు నేర్చుకొంటే మెదడు సమాచారాన్ని సులువుగా నిక్షిప్తం చేసుకొంటుందనీ,రెండు కంటే ఎక్కువ భాషల వల్ల మెదడు పనితీరు మెరుగై అర్జిమర్స్ డిమెన్షియా వంటివి త్వరగా రావని ఆలోచన శక్తి తగ్గదనీ నిపుణులు చెపుతున్నారు.