Skip to content
Vanitha Blog

Vanitha Blog

Vanitha Blog

Menu
  • Home
  • Navvithe Navvandi
  • Gagana
  • You&Me
  • Nemalika
  • WhatsApp
  • WoW
  • Sogasu Chuda Tarama

Category: You&Me

23 Articles
అడవి ఎంతో బావుంటుంది. ఎతైన వృక్షాలు అల్లిబిల్లిగా అల్లుకున్న తీగలు పేరు తెలియని అద్భుతమైన పువ్వులు. ఎగిరేవందలాది తుమ్మెదలు పక్షుల అరుపులు గుంపులుగా అడవి జంతువులు. ఈ అద్భుతమైన ప్రకృతి ఎప్పుడూ వంటరిగా ఎడారిలో మొలిచే జిల్లేడు మొక్కలా వంటరిగా ఉండదు. అలాగే చుక్క నీళ్లు పడని ఎడారిలో కూడా అందుకు తట్టుకు బతికే చెట్లుంటాయి. ఇంత పచ్చ దనం ఇంతటి అందం మానవసమూహాల్లో ఉంటుంది. చాలా మంది కలిసిన చోట ఎంతో సందడి స్నేహం మాట ఆడో పండగ. అందుకే ఒంటరిగా ఎవ్వరితోను కలవకుండా ఉండద్దు. నలుగురిలో కలివిడిగా వుండండి అంటుంటాయి. అధ్యయనాలు సామాజికంగా చురుగ్గా బిజీగా ఎప్పుడూ ఎదో ఒక పనిలో మునిగితేలాలి. లేకపోతే గుండె జబ్బులు వస్తాయంటారు. స్వచ్చందంగా ఎదో ఒక కార్యక్రమం చేప్పట్టటం లేదా స్నేహతులు ఇరుగు పొరుగులతో మంచి స్నేహం సంబంధాలు ఉంచుకోవటం చేయాలి. ఒంటరితనం నైరాశ్యం లోకి దారి తీసి అనేక దిగుళ్ళ వత్తిడి లతో ఆరోగ్యం చెడిపోయి అతి చిన్న వయస్సు లోనే తీవ్రమైన జబ్బులొస్తాయి. అంటున్నాయి అధ్యయనాలు. ఏ రూపం లో ఎలా గడిపినా సామజిక కలివిడితనం అనివార్యం.
Categories
You&Me

సామాజికంగా చురుగ్గా ఉంటేనే ఆరోగ్యం

February 21, 2017
0 mins read
అడవి ఎంతో బావుంటుంది. ఎతైన వృక్షాలు అల్లిబిల్లిగా అల్లుకున్న తీగలు పేరు తెలియని…
Read more
పిలల్ల పెంపకం పిల్లల గురించిన బాధ్యత ప్రస్తావన వస్తే మనం సాధారణంగా తల్లనే మెన్షన్ చేస్తాం. కానీ పిల్లలపై ముఖ్యంగా టీనేజ్ లో వుండే వారిపై తండ్రి ప్రభావం ఎక్కువగా పడుతుందని నిపుణులు చెపుతున్నారు. టీనేజ్ ఆడపిల్లల్లో లెక్కలు కెమిస్ట్రీ వంటి కష్టమైనా సబ్జెక్టు లలో రాణించాలంటే తండ్రి ప్రేమ బాగా అవసరం అనేది నిపుణుల అభిప్రాయం. అలాగే అబ్బాయిలకు భాషా పరిజ్ఞానం వృద్ధి చెందాలంటే తండ్రి సాహచర్యం కావాలి. సాధారణంగా పబ్లిక్ వుండే తండ్రి వెంట టీనేజ్ పిల్లలుంటే వాళ్లకు ఎంతో మందితో మాట్లాడే పరిశీలించ గలిగే అవకాశం వస్తుంది. తల్లి ఎంత చదువుకున్నదైనా ఆఫిసరైనా ఆమెకు ఉండే పనుల భారం తో ఇల్లు ఆఫీస్ సమర్ధించుకుంటూ పిల్లల అవసరాలు చూసేసరికి సమయం గడిచిపోతూ ఉంటుంది. పిల్లలు తల్లితో పాటు తండ్రి తో కలిసి మెలిసి తిరిగితేనే వాళ్ళు అన్నింటా రాణిస్తారని ఆత్మవిశ్వాసంతో వుంటారని నిపుణుల అభిప్రాయం.
Categories
You&Me

ఇరువురి ప్రేమతోనే ఆత్మవిశ్వాసం

January 17, 2017
0 mins read
పిలల్ల పెంపకం పిల్లల గురించిన బాధ్యత ప్రస్తావన వస్తే మనం సాధారణంగా తల్లనే…
Read more
ఉద్యోగ జీవితం ఎప్పుడూ సవాళ్ల మయమే. ఎంతోమంది సహోద్యోగులతో కలిసి పనిచేయాలి. ఎన్నో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అవి మన కెరీర్ పైన కూడా ప్రభావం చూపెడతాయి. కానీ కొంత జాగ్రత్తతో తెలివిగా మెలిగితే ఉద్యోగ సోపానాలు తేలికగా ఎక్కేయచ్చు. ఏదైనా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలిసి వచ్చినప్పుడు కొత్త పని చేయవలిసివచ్చినప్పుడు ఎప్పుడు సహోద్యోగ సలహాలు తీసుకోకూడదు. మన ఉద్యోగం పట్ల మన బాధ్యత పట్ల మనకే ఒక స్పష్టత ఉండాలి. ఉద్యోగంలో చేరగానే అక్కడ నియమ నిబంధనలు తెలియకపోవచ్చు. సంస్థ పెద్దవో చిన్నదో దానికి పరిధులు నియమాలు ఉంటాయి వాటిని తెలుసుకుని అర్ధం చేసుకుని ఉద్యోగంలో ఇమిడిపోయే ప్రయత్నం చేయాలి. అన్నింటికంటే ముఖ్య విషయం ధైర్యం. చాలా మంది అమ్మాయిలు స్కూల్ లాగా ఆఫీసుల్లో కూడా వెనక ఉండేందుకు సీనియర్లు ఉన్నతాధికారుల ముందు నోరు విప్పకుండా ఉండేందుకే ప్రయత్నిస్తారు. కానీ ఉద్యోగ జీవితం ఒక భవిష్యత్తు. తెలివి తేటలు నిరూపించుకుని ముందుకువెళ్ళే రాజమార్గం. ఎప్పుడూ ముందే ఉండాలి. మిమల్ని మీరే ఆవిష్కారించుకోవాలి. అప్పుడే అద్భుతమైన కెరీర్ దక్కుతుంది.
Categories
You&Me

ఎప్పుడూ ఫస్ట్ ప్లేస్ లోనే ఉండాలి

December 16, 2016
0 mins read
ఉద్యోగ జీవితం  ఎప్పుడూ  సవాళ్ల మయమే. ఎంతోమంది సహోద్యోగులతో కలిసి పనిచేయాలి. ఎన్నో…
Read more
ఏడడుగులబంధం కోసం ఆచితూచి అడుగులేస్తున్నారు అమ్మాయిలు. తన చేయి పట్టుకుని జీవితాంతం తోడుగా నిలబడే వ్యక్తి వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇస్తున్నారని విద్యావంతులైన మగవాళ్లనే పెళ్లాడేందుకు ఇష్టపడుతున్నారని ఒక మ్యారేజ్ వెబ్సైట్ సర్వేలో తేలింది. ఇందులో 6000 మంది వినియోగదారులు అభిప్రాయాలూ తీసుకున్నారు. ఆడపిల్లల అభిప్రాయాలను తీసుకుంటే ప్రతి ఇద్దరు ఆడపిల్లల్లో ఒకళ్ళు ఉమ్మడి కుటుంబాలకు చెందిన మగవాళ్ళని పెళ్లాడేందుకు ఇష్టపడుతున్నారు. 60 శాతం మంది అమ్మాయిలకు కులం గురించి పట్టింపే లేదు. ప్రతి పదిమంది ఆడపిల్లల్లో ఆరుగురు యువతులు చూడచక్కని వాళ్ళని ఎంచుకోకుండా వాళ్లే ప్రొఫైల్స్ చూస్తున్నారు. 40 శాతం మంది అమ్మాయిలు వాళ్ళ జీవిత భాగస్వాములను వాళ్లే ఎన్నుకుంటున్నారు. తమ గురించి చెప్పటంలో ఎదుటివాళ్ళ గురించి తెలుసుకోవడంలో అమ్మాయిలే మాట కలుపుతున్నారు. ముఖ్యమైన మాట 85 శాతం మహిళలు కనీసం బ్యాచిలర్ డిగ్రీ అన్నా ఉంటే తప్ప డబ్బు రూపం వున్నా వద్దులే అంటున్నారు.
Categories
You&Me

విద్యావంతులైతేనే సరే అంటున్నారు

December 16, 2016
0 mins read
ఏడడుగులబంధం కోసం ఆచితూచి  అడుగులేస్తున్నారు అమ్మాయిలు. తన చేయి పట్టుకుని జీవితాంతం తోడుగా…
Read more
ఎంతో గాఢమైన స్నేహాల్లో ఒక్కసారి డబ్బు దగ్గర చెడిపోతూ ఉంటాయి. మనం మాట్లాడే మాటలు ప్రవర్తన డబ్బు అప్పు అడగటం తీసుకోవటం ఇవన్నీ కారణాలే. డబ్బు విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు ఎక్సపర్ట్స్. కొత్తగా పరిచయం అయినవాళ్లు కూడా గబుక్కున పర్సనల్ విషయాలు అడిగేస్తూ వుంటారు. జీతం ఎంత ? ఈ నగ బంగారందేనా ? ఇంతకు కొన్నావు ? సొంతిల్లెనా ? ఇవన్నీ మనల్ని చిరాకు పెడతాయి ఇలాంటి సందర్భాల్లో మాట్లాడకుండా సంభాషణ దారి మళ్లిస్తే సరిపోతుందంటూన్నారు అలాగే అందరు కలిసి ఏ హోటల్లోనే టిఫిన్ తిన్నారనుకోండి తప్పనిసరిగా మొహమాటం లేకుండా అందరం పంచుకుందాం అని చెప్పేసుకోవాలి. మొహమాటం కొద్దీ భరించి స్నేహాలు విసుగు తెచ్చేలా చేసుకోకూడదు. మన స్నేహితులే మన దగ్గర డబ్బు అప్పుగా తీసుకుని తిరిగి ఇవ్వకుండా వాళ్ళు మాత్రం అముఞ్చి దుస్తులు నగలు కొనుకున్నారనుకుందాం. అప్పుడు వెంటనే వాళ్ళ మొహం మీదే మా డబ్బు మాకివ్వకుండా ఇవన్నీ కొనుకున్నారా ? అని అడక్కూడదు అవి ఎవరో ఇచ్చిన కానుక కావచ్చు. లేదా వాళ్లే కొనుక్కుని ఉండచ్చు. నిజానిజాలు నిర్దారించుకుని ఆచితూచి మాట్లాడండి. లేకపోతే స్నేహాలు పోతాయి అంటున్నారు. టోటల్ మనీ మేక్ఓవర్ పుస్తకం రాసిన డాలీన్ . ఇవన్నీ డబ్బు వల్ల వచ్చే ఇబ్బందులు. ఇలాంటి సమయాల్లో మన వ్యక్తిత్వం బయట పడేలా ప్రవర్తించాలంటారాయన.
Categories
You&Me

ఇవన్నీ మనీమాటర్స్

December 14, 2016
0 mins read
ఎంతో గాఢమైన స్నేహాల్లో ఒక్కసారి డబ్బు దగ్గర చెడిపోతూ ఉంటాయి. మనం మాట్లాడే…
Read more
లైఫ్ లో ఏవో సమస్యలు వస్తూనే ఉంటాయి. గతాన్ని పదేపదే గుర్తుచేసుకుని చింతించటం వల్ల ఒత్తిడి ఆందోళన పెరుగుతాయే తప్ప పరిష్కారం కనిపించదు. అలాంటప్పుడు ఆ వ్యతిరేక భావనల్ని వదిలించుకునే మార్గం వెతకటం ఉతమం. అంటారు సైకలజిస్ట్లు. మనసులోని భావనను సన్నిహితులతో పంచుకోవాలి. లేదా ఓ కాయితం పైన రాస్తే మనసు తేలికవుతుంది. తిండి పైకి దృష్టి మళ్ళించవచ్చు. మంచి భోజనం చేస్తే కూడా డిప్రెషన్ తగ్గుతుంది. చిక్కుళ్ళు ఆక్రోట్స్ ఓట్ మీల్స్ తీసుకుంటే మూడ్ లో కొంత మార్పు వస్తుంది. చెమట పట్టేలా వ్యాయామం,బరువులు ఎత్తటం చేస్తే ఎండర్ఫిన్లు విడుదలై నూతనమైన శక్తీ వస్తుంది. మూడీ గావుంటే సాధ్యమైనంత సేపు నిద్రాపోయినా సరే విటమిన్ డి కూడా మూడ్ ని నియంత్రిస్తుంది. ఎండలో కాసేపు నడవండి. మనసుని సంతోషంతో నింపేవినవ్వించేవి గుర్తుకుతెచుకోవాలి. మెదడుకి స్వచమైన ఆక్సిజెన్ అందితే అదే మూడ్ లో మార్పు తెస్తుంది. పచ్చని చేట్లుందే చోటుకి ఏ పార్కుకి అయినా వెళ్లి కాసేపు మనుషుల మధ్యలో నడిస్తే ఇంకా బావుంటుంది. అంతేగాని ఆ నేగిటివ్ మూడ్ ని మోస్తూ లేనిపోని బాధ గుండెపై పెట్టద్దు .
Categories
You&Me

మూడీ గా వుండే మూడ్ లోకి రావాలి

December 13, 2016
0 mins read
లైఫ్ లో ఏవో సమస్యలు వస్తూనే ఉంటాయి. గతాన్ని పదేపదే గుర్తుచేసుకుని చింతించటం…
Read more
పిల్ల తెమ్మెర లాంటి సుగంధ పరిమళం వంటి యవ్వన దశ కరిగిపోవటం సహజాతి సహజం. కానీ మీదపడే వయసు తగ్గుతున్నా ఓపిక తీరాల్సిన బాధ్యతలు ఇవి ఇంకెముందిలే మన పనయి పోయిందనే భావన కలిగిస్తాయి. కానీ ఎక్సపర్ట్స్ ఈ ఆలోచనే పొరపాటుంటున్నారు. యువత లో ఉరిమే ఉత్సాహం వుంది. తుళ్ళిపడే జలపాత వేగం వుంది. వాళ్ళతో స్నేహం చేయండి. మీ యవ్వనం మీ దగ్గరే ఉంటుంది అంటున్నారు. అలాగే అవకాశం వచ్చిందంటే ఎపుడూ ఎదో ఒక కొత్త ప్రాంతానికి ప్రయాణానికి సిద్ధం అయిపోండి. ఈ అలవాటు మీ ఆలోచనలు చైతన్యవంతంగా ఉంచుతుంది. అంటున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఎప్పుడూ చిన్నవయసు వాళ్ళ చుట్టూ చేరినప్పుడు వాళ్ళకిసలహాలివ్వటం లేదా గత అనుభవాలు చెప్పటం లాంటి పనులు చేయద్దు. అసలు ముఖ్యంగా మీకు వయసుమీరి పోతుందన్న విషయం మీకు మీతో పాటు అవతలివాళ్ళకీ గుర్తొచ్చేదిప్పుడే. అలాగే వీలైనంత సౌకర్యంగా ఎలా ఉండాలో ఆలోచించుకుని ఆహారం చదివేపుస్తకాలు రోజూ వారి కార్యక్రమాలు విషయంలో కూడా కొత్తగా వచ్చే జీవితానికి అనుగుణమైన ఏర్పాట్లు చేసుకోవాలి. మంచి రొమాంటిక్ జీవితాన్ని గడపాలి. అన్ని బాధ్యతలు తీరిపోయాక జీవిత భగస్వాములతో మంచి జీవితం గడిపే సమయం ఇదే. తలుచుకుంటే 90 వ సంవత్సరంలో కూడా ఫుల్ యూత్ ఫుల్ గా ఎంజాయ్ చేయచ్చు అంటున్నారు నిపుణులు.
Categories
You&Me

అది కేవలం మీ ఆలోచనలో వచ్చిన మార్పు

December 9, 2016
0 mins read
పిల్ల తెమ్మెర లాంటి సుగంధ పరిమళం వంటి యవ్వన దశ కరిగిపోవటం సహజాతి…
Read more
పెళ్లిళ్లు జరిపేందుకు జాతకాలు శుభలగ్నాల కోసం చూస్తూ వుంటారు కానీ ఇద్దరి ఆలోచనలూ అభిరుచులు కలిసాయో లేదో చూడరు. సైకాలజిస్టులు ఈ విషయం, గురించి అమ్మాయిలను హెచ్చరిస్తున్నారు. కాబోయే భాగస్వామి మీకు సరైన జోడీనా కాదా అని తేల్చుకోమంటున్నారు. ముఖ్యంగా ధైర్యం పట్టిన చేయి విడువకుండా ఎలాంటి సందర్భాలనైనా ఎదుర్కోగలరా ? అలాగే అన్నింటికన్నా చాలా ముఖ్యం ఉదయం నిద్ర లేవటం వంటి మంచి అలవాట్లు ఉన్నాయా లేదా > మీ ప్రైవసీ ని గౌరవిస్తారా ? స్వీట్ మెమోరీస్ ని తలుచుకునేంత స్పందించే మనసుందా ? ఎదుటివాళ్లను గౌరవిస్తారా ? అలంటి వారు జీవిత భాగస్వామినీ గౌరవించగలరు కదా? చేసే పనిలో శ్రద్ధ వుందా ? ఉద్యోగంలో నైనా వ్యాపారం లో నైనా ఉన్నతమైన శిఖరం ఎక్కాలంటే పనిపట్ల శ్రద్ధ దీక్ష ఇష్టం వున్నాయా లేదా ఇలాంటి వన్నీ గమనించుకోమంటున్నారు. మరి కాలం తో పాటు మనస్తత్వాలు ఆలోచనలు అభిరుచులు మారిపోతున్నాయి కదా ? ఇవన్నీ బావుంటే అటు తర్వాతే జాతకాలూ ,లగ్నాలు అంటున్నారు వాళ్ళు. ప్రతి దాన్ని సైంటిఫిక్ గా ఆలోచించాలి మరి !
Categories
You&Me

అబ్బాయిలో ఈ లక్షణాలున్నాయా ?

December 7, 2016
1 min read
పెళ్లిళ్లు జరిపేందుకు జాతకాలు శుభలగ్నాల కోసం చూస్తూ వుంటారు కానీ ఇద్దరి ఆలోచనలూ…
Read more
జీవితంలో వచ్చే ఒక ముఖ్యమైన మలుపు పెళ్ళి. కాబోయే భార్య భర్తలు ఒకళ్ళ నొకళ్ళు అర్ధం చేసుకుని భావాలు పెంచుకుని, పెళ్ళికి సిద్ధం కండి అంటున్నారు. కౌన్సిలింగ్ నిపుణులు ముందుగా పెళ్ళి కాబోయే వ్యక్తులు నిజంగానే ఇస్తాపడుతున్నారా? లేదా పెద్ద వాళ్ళు నిర్ణయించారని సరే అన్నార, లేదా ఉద్యోగం, అందం ఇవన్నీ నచ్చి పెళ్ళి చేసుకుంటున్నారా తేల్చుకోవడం మొదటి అడుగు. ఉద్యోగం చేయాలా వద్దా అనే విషయం, జీవితంలో పాటించలనుకునే లక్ష్యం గురించి కాబోయే భాగస్వామి తో చేర్చించి అతని అభిప్రాయం తీసుకోవాలి. డబ్బు విషయంలో పొడుపు గురించి, భవిష్యత్తులో ఇద్దరు లేదా ఒక్కరి సంపాదన తో ఎలాంటి జీవితం నిర్మించుకోబోతున్నారు తెలుసుకోవాలి. ఇద్దరు ఒకరి పట్ల ఒకరు నమ్మకంగా వుండాలని నిర్ణయిచుకోవాలి. భవిష్యత్తులో కలుగబోయే పిల్లల గురించి కూడా ముందే చర్చించుకుంటేనే మంచిదంటున్నారు కౌన్సిలింగ్ ఎక్స్ పర్ట్స్ మరి పెళ్ళికి సిద్ధం అవుతున్నారంటే భవిష్యత్ ప్రణాళిక వుండాలి కదా!!!
Categories
You&Me

అన్యోన్య దాంపత్యం కూడా ప్లానింగే

November 28, 2016
1 min read
జీవితంలో వచ్చే ఒక ముఖ్యమైన మలుపు పెళ్ళి. కాబోయే భార్య భర్తలు ఒకళ్ళ…
Read more
Categories
You&Me

మగాళ్లకేనా ఖర్చుల.. ఆడాళ్లకుండవా ?

June 28, 2016June 16, 2017
1 min read
https://scamquestra.com/17-dokazatelsta-i-probely-afery-28.html
Read more
Categories
You&Me

వివాహ బంధానికి బీటలు పడుతున్నాయా ?

October 12, 2015July 12, 2016
0 mins read
వివాహ బంధానికి బీటలు పడుతున్నాయా ? సహజీవనానికి యువత సరే అంటున్నారా ?…
Read more

Posts navigation

Previous 1 2

Copyright © 2020 All Rights Reserved.

Copyright © 2020 All Rights Reserved.