నీహారికా ,
చదువుఒక్కటే చాలదు జీవితంలో గెలవాలంటే ఇంటి బాధ్యత తీసుకోవటం నేర్చుకోవాలి. అని మీ అమ్మ అంటోందనీ అన్నీ సమర్ధించగలమా అన్నావు. ఈ మాట పెప్సీకో సీఈఓ ఇంద్రా నూయీ కూడా చెప్పింది. మా అమ్మాయిలు ఎదిగిన తర్వాత నన్ను పొడుగుతున్నారు కానీ పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళ బాధ్యత తెలుసుకోలేక మా అమ్మను పిలిపించుకొన్నాను. మా అమ్మ కూడా ఇంట్లో నువ్వు తల్లివి కోడలివి అనేది అమ్మాయిలకు అన్నీ కావాలంటే కుదరవు అని ఆమె ఒక ఇంటర్వ్యూ లో చెపితే మహిళా సంఘాలు ఆమెను తప్పు పట్టాయి. కెరీర్ త్యాగం చేసి పిల్లలను పెంచి మంచి తల్లి అనిపించుకున్నా కెరీర్ లో వచ్చిన అద్భుతమైన అవకాశాలు అందిపుచ్చాక పైకిఎదిగినా ఎదో లోటు ఒకటి వుంటుంది గా. అందుకే నీహారికా అందుకోలేని వాటి గురించి అనవసరపు ఆలోచనలు వదిలేసి నువ్వు నీ చదువు ఉద్యోగం ఆద్వారా ఆదాయం పెళ్ళైతే కుటుంబం నిశ్చింతగా ఉండటం పిల్లలమంచి చదువులు జీవితంలో స్థిరపడటం ఇవన్నీ ఆలోచించుకో. మన ప్రాధాన్యతాక్రమాలుంటాయి. మనకు కావలిసినవన్నీ ముందున్నాయి. చదువుకుని ఉద్యోగంలోఉన్నత స్థానంలోకి వెళ్లి భర్త తో పాటు కలిసి సంపాదించి ఇల్లు దిద్దుకో. భవిష్యత్తులో ఎక్కే మెట్లే నీ గమ్యం అనుకో . అనవసరపు అపరాధ భవనాలు మనసులోంచి తుడిచేసి ముందుకు నడవటం నేర్చుకో