రసాయనాలు ఏ మాత్రం కలవని కొన్ని రకాల ఫ్యాక్ లు చర్మకాంతిని ఇనుమడించేలా చేస్తాయి . ఒక టేబుల్ స్పూన్ ముడి తేనే ను కొద్దిగా వేడిచేసి తట్టుకోగలిగిన వేడిలో ఉన్నా ఆ తేనెను ముఖంపైన రాసి ఆరిపోనివ్వాలి . గోరువెచ్చని నీళ్ళతో అరగంట తర్వాత ఈ ఫ్యాక్ ని కడిగేసుకోవాలి ఈ ఫ్యాక్ ముఖాన్ని మెరిపిస్తుంది. కీరారసం,గ్లిజరిన్ రోజ్ వాటర్ ఫ్రిజ్ లో ఉంచి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి . ఇది చల్లగా మొహానికి చాలా ఉపశమనం ఇస్తుంది . నిమ్మరసం ,తేనె కలపిన ఫ్యాక్ వేస్తే బ్లాక్ హెడ్స్ పోయి మొహం ప్రకాశవంతంగా ఉంటుంది .

Leave a comment