Categories
పెద్ద వాళ్ళతో సమానంగా పిల్లల దుస్తులు వస్తున్నాయి. ఆధునిక వస్త్ర శ్రేణిలో అందమైన డిజైన్లు చక్కని ప్రింట్లు పిల్లల కోసం వస్తున్నాయి. ఎన్నో రంగుల్లో మిక్స్ డ్ గా ఉన్న సిల్క్ గౌన్లు చాలా బావుంటాయి.పూల డిజైన్లు ఎప్పటికీ ష్యాషన్ . డిజిటల్ ప్రింట్స్ స్పెషల్ లుక్ ఇస్తాయి. ఇక చక్కని లాంగ్ పైకి పూసలతో చేసిన ఎంబ్రయిడరీ బ్లౌజ్ లు ,పూలతో కుట్టిన క్రోషెట్ తరహా టాప్ లు పూల మోటెఫ్లు కుట్టిన టాప్ లు ముచ్చటగా అమరుతాయి. సిల్క్ ,ఫ్యాన్సీ తరహా లెహాంగాలకు చక్కని ఎంబ్రయిడరీ డిజైన్లు, కుందన్ లు పూసలు ,రంగురాళ్ళతో తీర్చి దిద్దిన చక్కని అంచులు పిల్లలకు చక్కని అందం ఇస్తాయి. ఈ శ్రావణమాసం అయితే పట్టు తరహా వస్త్రశ్రేణికి ప్రాధాన్యత ఇస్తేనే బావుంటుంది.