శారీరక సమస్యలు ,ముఖ్యంగా కౌమార దశలో నెలసరి విషయంలో ఇతరుల అనుభవాలు వైద్యంలా తీసుకో కూడదు. శరీరకంగా ఎవరి స్థితి వారిదే. 15 సంవత్సరాల పిల్లల్లో నెలసరి ముందుగా వస్తుంది.అది అంతే అని నిర్లక్ష్యం వద్దు. 21 రోజుల కంటే ముందే వస్తున్న ,35 రోజుల పాటు రాకపోయిన సమస్య లాగే చూడాలి. అమ్మాయిలలో ఏడు రోజులు మించి రక్త స్రావం అవుతున్న ,రెండు గంటల వ్యవధిలో శానిటరీ న్యాప్ కీన్స్ మారుస్తున్నా అది అధిక రక్త స్రావానికి సంకేతంగా తీసుకోవాలి. అధిక బరువు సమస్య ,నెలసరి సమయంలో తీవ్రమైన నొప్పి ఇవన్ని మామూలే అని తోసిపుచ్చేవి కాదు. అండాశయల్లో సిస్ట్ లు ఉన్నా ఈ సమస్య రావచ్చు.

Leave a comment