ఎక్కువ గంటలు కంప్యూటర్ దగ్గర పని చేసే వాళ్ళకి అలసటతో కళ్ళ కింద నల్లని వలయాలు వస్తూ ఉంటాయి. కొంత వంశ పారంపర్యంగా సమస్య కావచ్చు. కొంత వరకు నిద్ర లేక పోవటం,రాత్రి వేళ పని చేయటంతో ఒత్తిడి ,అలర్జీ ,రక్త హీనత ,అస్తమా డీ హైడ్రెషన్ ఇలా ఎన్నో కారణాలు కావచ్చు. డాక్టర్ల సలహాతో తీసుకొనే అండర్ ఐ క్రీమ్ పూతలు వాడుతున్న కొన్ని వంటింటి పదార్థాలతో కూడా ఫేస్ ఫ్యాక్ వేస్తుంటే తొందరగా తగ్గిపోతాయి. బంగాళా దుంప గుజ్జులో నిమ్మరసం గులాబీ నీళ్ళు కలిపి కళ్ళ కింద పూతలా వేసుకోవచ్చు. పూదినా గుజ్జు నిమ్మరసం ,కొబ్బరి నూనె మిశ్రమం గానీ వేసుకొవచ్చు.ఏ పండ్ల గుజ్జులో నిమ్మరసం కలిపి వేసుకున్న ఇదే ఫలితం వస్తుంది. కానీ ప్రతి రోజు ఏదో ఓ ఫ్యాక్ వేసుకొని ,కాసేపు ఆరాక గోరువెచ్చని నీళ్ళతో కడిగేయాలి.

Leave a comment