Categories
మొదటి చిత్రంతోనే చక్కని పాత్రలు అందుకుంది శాలినీ పాండే. నా కెరీర్ తెరిచిన పుస్తకం వంటిది అంటుంది శాలిని. ఇప్పుడు నాకోసం అవకాశాలు వస్తున్నాయి. అర్జున్ రెడ్డి తర్వాత అలాంటి ముద్దు సన్నివేశాలు చేస్తుంటారా అని అడుగుతుంటారు ఇంటర్యూల్లో ఒక సినిమాలో చేస్తే అదే మూస ప్రతి సినిమాలో చేయాలా. నాకు గ్లామర్ పాత్రలే నప్పుతాయంటారు. గ్లామర్ అంటే నా దృష్టిలో సన్నివేశానికి అనుగుణమైన దుస్తులు వేసుకోవడం నటన,అందం మొదలైనవన్ని కలిపి పేక్షకులను మెప్పించడం చీరెలోనూ గ్లామర్ ఉంది. నేను బాగా నటించగలనని నిరూపించుకున్నాను. నా టాలెంట్ వెలికి తీసే పాత్రలు వస్తే సంతోషిస్తా అంటుంది శాలినీ.