Categories
సాధారణ గోధుమపిండి కంటే మల్టీగ్రెయిన్ పిండి లోవాడిన ధాన్యాలు, పప్పుల ను బట్టి పోషక విలువల్లో తేడాలుంటాయి. సోయా చిరుధాన్యాలు పప్పు ధాన్యాలతో చేసిన పిండి లో ప్రొటీన్లు పీచు కొన్ని ఖనిజాలు ఉంటాయి. ఆక్రోట్, బాదం, అవిసె గింజల్ని కలిపితే ఆరోగ్యకరమైన కొవ్వులు మల్టీగ్రెయిన్ పిండి లో లభిస్తాయి. మార్కెట్ లో దొరికే మల్టీగ్రెయిన్ పిండి లో ధాన్యాలు పప్పులు కొంత పీచు పదార్థం ఉంటుంది. అదే ఇంటి దగ్గర అయితే రకరకాల చిరు ధాన్యాలు పప్పులు ఇతర కొవ్వు పదార్థాలు కలిపి ఆరోగ్యవంతమైన పిండిని తయారు చేయించుకోవచ్చు. బరువు రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటే దేన్నయినా పరిమితంగా తీసుకుంటే అంతులేని ఆరోగ్యం సొంతం అవుతుంది.