Categories
![పిల్లల విషయంలో స్లీప్ హైజీన్ అంటే ఆరోగ్యవంతమైన నిద్ర అలవాటు అంటే తగినంతగా, నాణ్యమైన నిద్ర పోయేలా సరైన చర్యలు తిసుకోమంటున్నారు. చిల్డ్రన్స్ స్పెషలిస్టులు. పిల్లల విషయంలో పడుకునే సమయం, స్లీప్ రోటీన్ సౌకర్యంగా నిర్ణీత పద్దతిప్రకారం వుండాలి. పడుకునే వెలలు, నిద్ర లేచే సమయాలు నిర్ణీత క్రమంలో సాగాలి. వారాంతాల్లో సైతం ఈ రోటీన్ కు ఇబ్బంది కలుగ కూడదు. నిద్రించే వేళల్లో ఓ గంట కూడా మార్పు లేనట్లు వుండాలి. పడుకునే ముందు ఆటలు, టెలివిషన్ చూడటం, కంప్యుటర్ గేమ్స్ అడనివ్వకూడదు. ఆకలితో నిద్ర పొమ్మనడం లేదా పడుకునే ముందు అతిగా ఆహారం పెట్టడం రెండు తప్పే. కాఫీ, టీలు, పానీయాలు చాక్లెట్స్ అస్సలు ఇవ్వకూడదు. క్రమం తప్పకుండా అవుట్ డోర్ ఆటలకు ప్రోత్సహించాలి. పిల్లల పడక గది చాలా ప్రశాంతంగా వుండాలి. బాల్యంలో నిద్ర లేమికి గల కారణాలు వైద్యులను సంప్రదించి తెలుసుకోవాలి. అప్పుడే సమస్య పరిష్కారం అవుతుంది.](https://vanithavani.com/wp-content/uploads/2017/04/sleeping-baby.jpg)
కొత్తగా తల్లులయిన మహిళలు పిల్లల నిద్రవేళ గురించి కంగారు పడతారు. బిడ్డ రాత్రివేళ నిద్ర పోవాలని కోరుకుంటారు.స్లీప్ మెడిసిన్ జర్నల్ లో వచ్చిన ఒక అధ్యాయం అందరి పిల్లల నిద్రవేళ లు ఒకటిగా ఉండవని తేల్చింది.44 మంది పిల్లల నిద్రవేళ ను రెండు వారాలపాటు రికార్డ్ చేసిన ఈ అధ్యయనంలో చిన్న పిల్లలు ఎదిగే క్రమాన్ని బట్టి నిద్రవేళ ఉంటాయని పిల్లలకు తల్లులు సరిపోవు పాలు ఇచ్చి వారి పక్కనే నిద్రించటం వల్ల పిల్లలు చక్కగా నిద్రపోయే అవకాశం ఉందని తేలింది. పుట్టిన మొదటి ఆరు నెలలో పెరుగుదల బాగా కనిపిస్తుందని నిద్ర వేళల్లో మార్పులు ఉంటాయని తల్లులు ఈ విషయంలో గాబరా పడనవసరం లేదని వివరించింది.