Categories
సపోటా పండు కేవలం రుచి కోసం కాక శరీరానికి అవసరమైన పోషకాలు ఆరోగ్యం కాపాడు కోవటం కోసం తినాలి అంటారు డాక్టర్లు. వీటిలోని మినరల్స్ ,కాల్షియం ,ఫాస్పరస్ ,ఐరన్ వంటివి ఎముకలను పటిష్టం చేస్తాయి. కాఫర్ ఎముకల కణజాల ఉత్పత్తిని పెంచి ఆస్ట్రియో పోరోసిస్ ,కండరాల బలహీనత ఎముకలు విరిగిపోవటం కీళ్ళు బలహీనంగా మారటం వంటి సమస్యల నుంచి కాపాడుతోంది. సపోటల్లో ఎ,ఇ,సి విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచటంతో పాటు తేమనందిస్తాయి. సపోటాల్లోని ఫాలిఫినల్స్ చర్మం ముడతలు పడనివ్వవు. సపోటా గింజల నూనె జుట్టు రాలటాన్ని అరికడుతోంది.