చలి రోజుల్లో ఏళ్ళు, మొహాం కూడా పొడి బారీపోయి గోరు తగిలినా గీతలు పడతాయి. ప్రతి రోజు స్నానం చేసే నీళ్ళలో రెండు టీ స్పూన్ల కొబ్బరి నూనె కలిపి స్నానం చేస్తే ఈ చలికాలంలో తలెత్తే దురద,పొడి బారటం పోతాయి. ఇలా నిత్యం చేయాలి. పగిలిన పెదవుల పై రాత్రి వేళ వెన్న లేదా నెయ్యి రాస్తుంటే ఇది పెదవులకు కావాలసిన తేమను ఇస్తాయి. పాదాలు పగుళ్ళు వచ్చే స్తాయి ఈ పగళ్ళ కు నెయ్యి రాయవచ్చు. పసుపు నిమ్మరసం కలిపి చర్మం పై రాసుకొంటే చర్మం పై పేరుకున్న మురికి పోతుంది. ముఖంపై అవాంఛనీయ రోమాలు రాకుండా స్నానానికి ముందు పసుపు రాసుకోవాలి. ఇలా నిత్యం చేస్తే ప్రయోజనం ఉంటుంది. తేనె చక్కని మాయిశ్చరైజర్ .రోజు మొహం పై రాస్తే చర్మం మృదువుగా పట్టులా ఉంటుంది.

Leave a comment