కొన్ని ఫేస్ ప్యాక్ లు సింపుల్ గా అనిపిస్తాయి కానీ చాలా చక్కగా పని చేస్తాయి. పైగా ఇందులో రసాయినాలు కలిసే అవకాశం లేదు. కనుక ముఖ చర్మానికి కలిగే నష్టం కూడా లేదు. ఓట్ మీల్ ను మెత్తగా పొడి చేసుకోవాలి. అందులో తగినంత నీరు కలిపి పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమం ముఖం, మెడకి పట్టించాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటి తో కడిగేస్తే ఎండ వేడికి పగుళ్ళు బరుతున్న చర్మానికి మంచి పోషణగా వుంటుంది. చర్మం మంట పెడుతున్న ఈ ఓట్ మీల్ పాక్ తో స్వాంతన లభిస్తుంది. అలాగే ఈ ఓట్ మీల్ మిక్సీ చేసే సమయంలో మెత్తని అరటి పండు గానీ బొప్పాయి గుజ్జు కానీ కలిపినా ఇంకా మంచి ఫలితం వుంటుంది. ఈ రెండూ కూడా ఎండ వేడికి కమిలిన చర్మాన్ని సాధారణ స్థితికి చేరేలా చేస్తాయి. ఎక్కువ సమయం తీసుకోనక్కర్లేదు. పొడి చర్మానికి ఇది మంచి ట్రీట్మెంట్ కూడా.
Categories