Categories
ఈ సీజన్ లతో కర్బూజ ఎక్కువ దొరుకుతుంది. ఈ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటిల్లో ఉండే విటమిన్ సి తెల్ల కణాలను పెంచటంతో పాటు ఫ్రీ రాడికల్స్ ను నిరోధించటం ద్వారా అనారోగ్యాలు రాకుండా కాపాడుతాయి. పీచు అధికంగా ఉండటంతో జీర్ణ క్రియ బావుంటుంది. క్యాలరీలు చాలా తక్కువ విటమిన్ ఎ తో పాటు కొరోటినాయిడ్లు పుష్కలంగా ఉండటంతో కంటికండరాల క్షీణత రాకుండా ఉంటుంది. పుష్కలంగా ఉండే ఫారలేట్లు గర్భిణులకు ఎంతో మేలు చేస్తాయి. నీటి శాతం అధికంగా ఉండటం వల్ల ఎండ వేడిమికి చర్మం పొడి భారకుండా ఉంటుంది. వీటిలోని పోషకాలు శరీరంలోని టాక్సిన్లు బయటికి పోయేలా చేసి చర్మంపైన ముడతలు రాకుండా చూస్తాయి.