Categories
చిన్న చిన్న ఫ్యాషన్ టిప్స్ తో ఎంతో మార్పు సాధించవచ్చు .చామంతులు మరిగే నీళ్ళలో వేసి ముఖానికి ఆవిరిపడితే చర్మంలోని మృత కణాలు పోయి మెరిపుతో ఉంటుంది. ఛాతీ వత్తుగా ఉంది అనిపిస్తే పూల ప్రింట్లు హెవీ డిజైనర్ టాప్స్ వేసుకొంటే ఆ ఇబ్బంది కనించదు అంటారు ఫ్యాషన్ డిజైనర్లు . వ్యాయవాల కోసం జిమ్ కి వెళ్ళే అవకాశం లేకపోతే తాడట ఆడాండి. ఇరవై నిమిషాలు విరామం లేకుండా ఆడితే 200 కేలరీలు ఖర్చు అవుతాయంటున్నారు ఫిట్ నెస్ ఎక్స్ పర్ట్స్. దగ్గు బాధపెడుతూ ఉంటే బాధం పప్పుల్ని మెత్తగా పొడి చేసి ఒక స్పూన్ తేనె కలిపి తీసుకోంటే దగ్గు తగ్గిపోతుంది. ఇలా రోజుల్లో నలుగైదు సార్లు ఒక డోస్ లాగా తీసుకొవటం మేలు అంటారు ఆయుర్వేద వైద్యులు.