Categories
భారతదేశంలో కథలు చెప్పే సంస్కృతి గొప్పగా ఉంటుంది.. కథలు, పాటలు మంత్రాలు నృత్యరూపకాలు పురాణాలు చరిత్ర మతాలు ఆదేశాల వంటివి ఎన్నో కథలుగా మలిచి చెప్పేందుకు వీలుగా ఉన్నాయి.. కథలు ఊహా శక్తిని, సృజనాత్మకతను ఆలోచనను తెలియజెప్పేందుకు అవసరమైన శక్తివంతమైన సాధనాలు గా రూపాంతరం చెందాయి. కథలు పిల్లల్లో ఊహ శక్తిని పెంచుతాయి. ఎదుటి వాళ్లు చెప్పే విషయాన్ని అర్థం చేసుకునే వయసు వచ్చిన దగ్గర నుంచి పిల్లలు కథలు వినేందుకు ఆసక్తి చూపిస్తారు. పిల్లలు కథలు చెప్పాలి కథల్లోని మంచి విషయాలు పాత్రల మంచి అలవాట్లు పద్ధతులు చిన్నారుల బుర్రల్లో నాటు కుంటాయి. పెద్దలు పిల్లలతో కలిసి గడిపే సమయం పెరుగుతుంది.కథలు వింటూ ప్రశ్నలు అడుగుతూనే ఉంటాం వారి ఎదుగుదలకు అవసరం. కథ వినటంతో పిల్లల్లో ఏకాగ్రత ఓర్పు సహనా లను పెంచుతుంది.