కేరళలోని కొల్లం కు చెందిన అన్న ఎలిజబెత్ జార్జ్ అనే ఫ్యాషన్ డిజైనర్, ఫ్లోరిస్ట్ వోనం పండగ కోసం నమిలి మింగేయ గల సరి కొత్త చీర సృష్టించింది. దుంపల గుజ్జు నుంచి తీసిన పొడి, బియ్యం పిండి కలిపి  అరఠావు పరిమాణంలో పలుచని పొర తయారు చేసే వాటితో ఐదున్నర మీటర్ల చీరలు రూపొందించింది. కేక్ డెకరేషన్ లో వాడే బంగారు రంగు కొంగుకు, చీర అంచుకు అద్ది, దాన్ని కేరళ సాంప్రదాయపు చీరెలా తయారు చేసి ఆ చీరని ధరించిన ఫోటో ఇన్ స్టా లో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. 30 వేల ఖర్చుతో తయారైన ఈ తినే చీరెను  తమకు కూడా చేసి ఇవ్వమని ఎన్నో ఆర్డర్స్ వచ్చాయట. ప్రపంచంలోనే ఇది తొలి ప్రయోగం.

Leave a comment