“వేడుకుందామా..వేంకటగిరి వేంకటేశ్వరుని వేడుకుందామా”..

హైదరాబాద్ చిక్కడపల్లిలో వెలసిన క్షేత్రమే ఈ వెంకన్న దేవాలయం…భక్తుల కోర్కెలు తీర్చే స్వరూపుడు.అతి పురాతన కాలం నుండి ఈ దేవాలయం ఉన్నది అని చరిత్ర చెబుతోంది….చిక్కడపల్లి వేంకటేశ్వర స్వామి ప్రత్యక్ష దైవం. ఇక్కడ స్వామి వారి సన్నిధిలో బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి వైభవంగా జరుగుతాయి….దేవాలయానికి సమీపంలో ఒక కోనేరు వుంది. దానిలో వున్న నీరు తాగిన సర్వ పాపాలు తొలగి పొతాయి అని భక్తుల నమ్మకం….శుభకార్యాల కోసం ఈ క్షేత్రానికి భక్తులు పూజలు చేసుకోవటానికి దూరదూరాల నుంచి వస్తారు.

ఇష్టమైన పూలు: అన్ని రంగుల పూలు సమర్పించిన ఆనందం

ఇష్టమైన పూజలు:గోవింద నామస్మరణ

నిత్య ప్రసాదం: కొబ్బరి,పులిహోర, పండ్లు

పులిహోర తయారీ: అన్నం వండిన తరువాత చింతపండు పులుసు లో పచ్చిమిర్చి, పోపు గింజలు వేసి బాగా ఉడికించి,కర్వేపాకు దండిగా వేసి, వండిన అన్నంలో  తయారు చేసిన మిశ్రమాన్ని కలిపి,వేయించిన జీడిపప్పుతో నైవేద్యం పెట్టండి.

-తోలేటి వెంకట శిరీష

 

Leave a comment