పామాయిల్ సాధారణంగా మన సరుకుల లిస్ట్ లో ఉండదు. ఏదైన బ్రాండ్ ఆయిల్ ఇచ్చిన గౌరవం పామాయిల్ కు ఇవ్వము. ధర తక్కువగా ,అందరికి అందుబాటులో ఉండే పామాయిల్ లో అనేక పోషకపదార్ధాలున్నాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బీటాకెరోటిన్ ,ప్రోటీన్లు యాంటీ ఆక్సిడెంట్లు ,ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. చర్మాన్నీ తేమగా మృదువుగా ఉంచుతుంది. కొలెస్ట్రాల్ పెరగనీయదు. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అల్జీమర్స్ నివారణకు ఉపకరించే గుణాలు పామాయిల్ లో అధికంగా ఉన్నాయి . ఇన్నీ ఉపయోగాలు ఉన్నాయని గుర్తించి నందువల్లనే పిండి వంటలు ఇతర పదార్థాల తయారీలో పామాయిల్ కు విశేషమైన ప్రాధాన్యత ఇస్తారు.

Leave a comment