కర్పూరపు చెట్టు నీలగిరి కొండల్లో పెరుగుతుంది చక్కని సువాసన గలిగిన బెరడు వుంటుంది. కర్పూరం చెట్టు వేర్లు, మాను, కొమ్మలను నీళ్ళలో వేసి మరిగించి డిస్టిలేషన్ పద్దతిలో సేకరించే కర్పూరాన్ని పచ్చ కర్పూరం అంటారు. రెండు పలుకుల పచ్చకర్పూరం తీసుకుని కొంచం మంచి గంధం, వెన్న కలిపి తమల పాకులోని వేసుకుని నమిలి రసం మింగితే కళ్ళు బైర్లు కమ్మడం, తలతిరగడం, కడుపులో వికారం, అతిగా చమటలు పట్టడం తగ్గిపోతాయి. ఒంట్లో వేడి తగ్గుతుంది. ఈ వేసవి ఎండలకు వడదెబ్బ, అతి దాహం, శరీరం చమటలు పట్టడం, శోష రావడం మొదలైనవి కూడా ఈ పచ్చకర్పూరం తీసుకుంటే తగ్గిపోతుంది. కంటికి సంబందించిన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లు రావు. ప్రచీన వైద్య విధానంలో పచ్చ కర్పూరం వాడకం వుంది. ఆరోగ్యం పచ్చగా వుండాలంటే ఒక చిన్నపలుకు పచ్చ కర్పూరం తీసుకుంటే మంచిదే. ఇంకా ఉపయోగాల కోసం ఆయుర్వేద వైద్యులను సంప్రదించవచ్చు.
Categories