చెరుకు రసాన్ని వేసవి పానీయం అంటారు. డీ హైడ్రేషన్ కు గురైతే తక్షణ శక్తి ఇస్తుంది చెరుకురసం. ఇందులో గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా వుంటుంది. అంచేత మధుమేహం వున్న వాళ్ళు కూడా ఈ రసం తాగొచ్చు. చెరుకురసంలోని ఫినాల్, ఫ్లేవనాయిడ్ లు శరీరంలోని చెడు బాక్టీరియా తొలగిస్తాయి. కాలేయ వ్యాధులు రాకుండా కామెర్లు రాకుండా కాపాడుతుంది. అలసట నివారించగల మెగ్నీషియం, పోటాషియం, పాస్పరస్, కాల్షియం, ఎలక్ట్రోలైట్స్ చెరుకురసం లో పుష్కలంగా ఉన్నాయి. దాహం తీర్చి బలాన్ని ఇస్తుందీ రసం. ఇందులో పుదీనా అల్లం నల్లరాతి ఉప్పు కలిపి తాగితే వేసవి తాపం భాదించదు. ఇది నూరు శాతం సహజమైన తియ్యదనం ౩౦ గ్రాములుటుంది. 18 శాతం కాలరీలుంటాయి ఆరోగ్య కరమైన పీచు 13 గ్రాములు వుంటుంది. ఇందులో వుండే సుక్రోజ్, ఫ్రక్టోజ్ ఇతర గ్లూకోజ్ పదార్ధాల ద్వారానే సహజమైన తియ్యదానం వస్తుంది.

Leave a comment