డైటింగ్ చేయటం అంటే బోలెడన్ని తిప్పలు పడటమే. ఆహారాన్ని తగ్గించుకొనే విషయంలో ఒక మంచి టిప్ గురించి చెపుతున్నారు ఎక్స్పర్ట్స్. చిన్న ప్లేట్లలో ఆహరం వడ్డించుకోమంటున్నారు. ఇందువల్ల చిన్న ప్లేట్ నిండా నిండి ఉన్న ఆహరం చూడటం వల్ల మెదడు తృప్తి పడుతుందంటారు. అప్పుడే చాలినంత ఆహరం తిన్నట్లవుతుంది. అనవసరంగా పెద్ద ప్లేట్లో పెట్టుకున్న ఆహరం మొత్తం బలవంతంగా తినవలసిన అవసరం రాదు. చిన్న ప్లేట్ లో ఎంత కావాలో అంతే పట్టేలా ఉంటుంది. కొందరు ఆహారాన్ని ఆస్వాదిస్తూ నెమ్మదిగా నింపాదిగా తింటే ఇంకొందరు గబగబా ఎవరో తరుముతున్నట్లు హడావిడిగా తినేస్తారు. కానీ ఆహరం తినే విషయంలో చాలా నెమ్మదిగా, తినే ఆహరం రుచి చూస్తూ తినడం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. నెమ్మదిగా నమిలి మింగటం వల్ల కనీసం పదిహేను శాతం తక్కువ తింటారని నిపుణులు చెపుతున్నారు. బరువు తగ్గాలనుకొనేవాళ్ళు పాటించవలసిన నియమం ఇది.
Categories