చిన్న చిన్న టిప్స్ నేర్చుకుంటే మొహం పై కనిపించే చిన్న చిన్న లోపాలను మేకప్ తో మాయం చేయవచ్చు. ముఖం పై మచ్చలు కనిపించకుండా చేసేందుకు కన్సీలర్ వాడతారు. ఆ కన్సీలర్ ని ఐ షాడోగా రాసుకునే ముందు కనురెప్పల పై అద్దితే కనురెప్పలు మెరుస్తాయి. నిద్ర లేమితో కళ్ళు ఉబ్బినట్లుకనిపిస్తే కన్సీలర్ తో ఆ వాపు కనిపించకుండా పోతుంది. వయసు పెరుగుతున్న కోద్ది కళ్ళ కింద ముక్కు రెండు వైపులా కింద పెదవి దగ్గర చిన్ని గీతలు కనిపిస్తాయి. నవ్వితే పెదవి పక్కన గీతలోస్తాయి. ఇవన్ని కొద్దిపాటి కన్సీలర్ ఆ ప్రదేశాల్లో రాస్తే గీతలు కనిపించవు. కొంచెం శ్రద్దగా ఇలాంటి టిప్స్ నేర్చుకుంటే చిన్నిపాటి మేకప్ తో ముఖం చక్కగా ఉంటుంది.

Leave a comment