Categories
సీజనల్ గా చింత చిగురు దొరికే రోజులు ఇవే. ఈ చిగురులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.ఇవి చెడు కొలెస్ట్రారాల్ని తగ్గిస్తాయి.వారంలో నాలుగైదు సార్లు తిన్న మంచిదే. ఈ చిగురులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ.నీటిలో చింతచిగురు వేసి ఉడికించి ఆ నీటితో పుక్కిలిస్తే గొంతు నొప్పి, మంట, వాపు తగ్గుతాయి నోటిపూతకు చింత చిగురు మంచి ఔషధం లాగా పనిచేస్తుంది.ఇందులో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది కనుక రోగనిరోధకశక్తి ఎక్కువే. థైరాయిడ్ తో బాధపడే వాళ్ళు చింత చిగురు తరచూ తింటే ప్రయోజనం.