Categories
రోజంతా ఆఫీస్ లో జాబ్ చేసే ఉద్యోగినులకు సాధారణంగా వ్యాయామానికి సమయం ఉండదు . అయితే ప్రతిగంటా ,గంటన్నరకు ఒకసారి స్ట్రెబ్బింగ్ వ్యాయామం చేయమంటున్నారు ఎక్స్ పర్డ్స్ . మోకాళ్ళు వంచకుండా ముందుకు వంగి పాదాల్ని పట్టుకోవాలి . మెడ కుడి , ఎడమకు తిప్పటం ,చేతులను సవ్య ,అపసవ్య దిశల్లో తిప్పటం వంటివి చేసినా చాలు . సాయంత్రానికి కండరాలు పట్టేయకుండా ఉంటాయి . అలాగే వత్తిడిగా ఉంటే కాస్సేపు చేస్తున్న పని అవతల పెట్టి ఏదైనా సంతోషాన్ని కలిగించిన పాత అనుభవం గుర్తుకు తెచుకొమ్మంటున్నారు ఏదైనా తేలికైన స్నాక్ తింటే కూడా శరీరం రీఛార్జ్ అవుతుంది .