టీ పొడి, పాలు చెక్కెర కలిపి అందులో ఇలాచీ, అల్లం లాంటి దినుసులు వేసి గుమఘుమలాడే టీని న్యాయంగా టీ అనాలి. కానీ పాలు పంచదార లేని గ్రీన్ టీ తెర ముందుకు వచ్చింది. తేయాకు రుచి తప్ప మహత్తర మైన మూడు అక్షరాలను కలుపుకుని వస్తుంది కాబట్టి కష్టపడి తాగుతున్నాం అయిందా ఇప్పుడిక కేమీలియా అసామికా టీ వస్తుంది. కెఫిన్ లేకుండా ఔషద గుణాలు కలిగిన ఈ టీని అంటున్నారు కేన్వీ శాస్త్ర వేత్తలు. వంకాయ వర్ణం ఆకులతో వుండే ఈ కేమీలియా అసోమికా మొక్కలలోని ఔషదాలను గుర్తించి దీన్ని టీ గా అభివృద్ధి చేసారు. చక్కర నిల్వన్ని నియంత్రించి కోలెస్ట్రోల్ తగ్గిస్తుంది ఈ ఆకు టీ. కంటి చూపు మెరుగు పడుతుంది. ఇందులోని ఫ్లేవనాయిడ్స్ నరాలను కపాడుతుందిట. ఇప్పుడుమార్కెట్ లో ఉందీ పర్పుల్ టీ.

Leave a comment